గత మూడు రోజులుగా WFI అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌ను ఆ పదవి నుంచి తప్పించాలంటూ నిరసనలు చేస్తున్న రెజ్లర్లు ఎట్టకేలకు శాంతించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక వారి మీ టూ ఉద్యమాన్ని విరమించారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ స్వయంగా దిగి వచ్చి చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. కమిటీ విచారణ పూర్తయ్యేవరకు బ్రిజ్‌భూషణ్ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉంటాడని మంత్రి చెప్పారు.