పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో బాలుడి అదృశ్యం విషాదంగా ముగిసింది. నిన్న సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్న ఏడాది బాలుడు భాను ప్రకాష్ కనిపించకుండా పోయాడు. దీంతో బాలుడి కోసం తల్లిదండ్రులు గాలించినప్పటికీ ఆచూకి లభించలేదు. చివరకు ఇంటి సమీపంలోని బావిలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన తమ కుమారుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.