ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలో షాకింగ్ ఘటన జరిగింది. సుర్జీత్ సింగ్ అనే వ్యక్తి తనను భూమి విషయంలో తహశీల్దార్, బీజేపీ నాయకుడు వేధిస్తున్నారని ఆరోపించాడు. అనంతరం తహశీల్దార్ ఆఫీసులోనే సోమవారం పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలిపోతున్న అతడిని అక్కడి వారు కాపాడడానికి ప్రయత్నించారు. అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.