మహిళా గర్భంపై ముంబై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 33 వారాల గర్భాన్ని తొలగించుకునే హక్కు మహిళలకు ఉందని పేర్కొంది. మెడికల్ బోర్డుకు దీనిపై ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేసింది. కాగా 33 వారాల గర్భంతో వచ్చిన ఓ మహిళ కేసును విచారించిన కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. మహిళలకు వారి గర్భంపై పూర్తి స్వేచ్ఛ ఉంటుందని కోర్టు తెలిపింది.