మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ యశ్వంత్ నేతృత్వంలోని ‘వంచిత్ బహుజన్ అగాధి’(VBA)తో పొత్తు ద్వారా ముంబై స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతున్నట్లు ప్రకటించింది ఉద్దవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన. ఈమేరకు ముంబై మున్సిపల్ ఎన్నికలకు వెళ్తున్నట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది. పొత్తు కోసం 2 నెలలుగా చర్చలు జరిగినట్లు సమాచారం.