ఏపీలోని అనకాపల్లి జిల్లాలో కొంతమంది యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. చోడవరం మండలంలోని అన్నవరం గ్రామంలో యువకులు వాహనాలకు అడ్డుపడి దౌర్జన్యం చేశారు. వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఓ బస్సుపైకి రాయి విసరడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. బస్ డ్రైవర్ ను కూడా ఆ యువకులు దుర్భాషలాడారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa