ఓ ఇంట్లో నెల రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ప్రమాదవశాత్తూ జరిగిన అగ్నిప్రమాదంలో ఆ ఇల్లు కాలి బూడిదైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ లో జరిగింది. విద్యుత్ స్తంభం నుంచి వచ్చిన నిప్పురవ్వతో ఇంటికి మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదంలో రూ.లక్ష నగదు, కట్నం బైక్, నగలు కాలి బూడిదయ్యాయి. ఒక నెల తర్వాత ఆ ఇంటి యజమాని కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఇలా జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa