సోమవారం రాత్రి 10 గంటల సమయములో బొబ్బిలి కోర్టు జంక్షన్లో పెట్రోల్ బంక్ లోకి ఓడీ 18 ఏ 7999 నంబరు గల ఓ లారీ దూసువెళ్ళింది. విశాఖ నుంచి రాయగడ వైపు వెళ్తుండగా ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఎదురుగా ఉన్న దుకాణలను స్కూటీని ఈడ్చుకొని ముందుకుపో యింది. సరిగ్గా పెట్రోల్ పంపుల వద్దకు వెళ్లి ఆగిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో స్థానికులు, బంకు సిబ్బంది ప్రాణభయంతో పరుగులు తీశారు.
అప్పుడే షాపులు మూతపడడం, చలికాలం కావడంతో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లేకుంటే భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. దుకాణాలకు తాళాలు వేసి యజమానులు వెళ్లారు. ఇంతలోనే ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన లారీలో డ్రైవరు తప్ప ఇంకా వేరెవరూ లేరు. డ్రైవర్ మద్యం మత్తులో ఏ సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.