మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవీంద్ర 18వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర ఘాట్ వద్ద కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. మంగళవారం ఉదయం పరిటాల రవీంద్రకు మాజీ మంత్రి పరిటాల సునీత , పరిటాల శ్రీరామ్ , పరిటాల సిద్ధార్థ్, కుటుంబసభ్యులు నివాళులర్పించారు. జోహార్ పరిటాల రవీంద్ర, పరిటాల రవీంద్ర ఆశయాలు సాధిస్తాము అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యకర్తలు, నేతలు నివాళులు అర్పించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa