ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి లడ్డూ కౌంటర్‌ ఓ దొంగ చేతివాటం,,రూ. 2 లక్షల పైగా నగదు ఆహరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 05:25 PM

దొంగలకు గుడి...బడి అన్న తేడా ఏమీ ఉండదు. అదును చూసి తమ పథకాన్ని పదును పెడుతారు. తాజాగా కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో దొంగతనం జరిగింది. ఏకంగా శ్రీవారి లడ్డూ కౌంటర్‌లోనే ఓ దొంగ చేతివాటం ప్రదర్శించాడు. 36వ నంబర్ కౌంటర్లో.. కౌంటర్ బాయ్ నిద్రిస్తుండగా.. 2 లక్షల పైగా నగదును దోచుకెళ్లాడు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై టీడీపీ సీరియస్ అయ్యింది. వన్ టౌన్ పీఎస్‌లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు, పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేశారు.


ఈ చోరీ కేసులో సీసీ పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. గతంలో చోరీలకు పాల్పడిన వ్యక్తే దొంగతనం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరేస్ట్ చెయ్యడానికి ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారని తెలుస్తోంది. అయితే.. విజిలెన్స్ లోపం వల్ల ఈ దొంగతనం జరిగిందా? ఈ దొంగతనం వెనుక ఎవరున్నారు అనే చర్చ జరుగుతోంది. లడ్డూ కౌంటర్‌లోనే దొంగతనం జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల డ్రోన్ వీడియో వివాదం ముగియక ముందే.. ఈ దొంగతనం కలకలం రేపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa