లోకేష్ చేయబోయే పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పూర్తిగా పడిపోతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. లోకేష్‌ను టీడీపీ నేతలు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, అతనికి అంతసీన్ లేదన్నారు. ఆ పాదయాత్రతో ఒరిగేదేమి ఉండదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విప్పనిగళం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విప్పితే ఏం లాభమని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీలు అధికారంలో ఉండగా ఎందుకు అమలు చేయలేదని పాదయాత్రలో ప్రజలు ప్రశ్నిస్తే లోకేష్ ఏం సమాధానం చెబుతారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa