రష్యా అధ్యక్ష పదవి నుంచి పుతిన్ తప్పుకోనున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. పలు అంతర్జాతీయ మీడియా వర్గాల సమాచారం ప్రకారం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం నిరంతరం క్షీణిస్తోంది. గత కొద్ది రోజులుగా పరిస్థితి మరింత దిగజారినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఉక్రెయిన్-రష్యా యుద్ధం మధ్యలోనే పుతిన్ అధ్యక్ష పదవిని విడిచిపెట్టవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. దీనిపై రష్యా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు.