ఏపీ ప్రభుత్వం చేపట్టిన 'జగనన్న చేదోడు' పథకానికి అర్హుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు. అర్హులైన వారు ఆయా సచివాలయాల వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ కు అవసరమైన ధృవీకరణ పత్రాలను సమర్పించి, ఈనెల 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ కార్పొరేషన్ ఇంచార్జి ఈడీ తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు చేతి పనిముట్లు, పెట్టుబడి కోసం ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం చేయనుంది.