ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి బుధవారం రాజీనామా చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపించారు. త్వరలో భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్తో గిరిధర్ గమాంగ్, ఆయన కుమారుడు శిశిర్ ఈ నెల 13న భేటీ అయ్యారు. తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నారు.