దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి.నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయి 60,205 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 226 పాయింట్లు నష్టపోయి 17,891 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హిందుస్థాన్ యూనిలీవర్ (1.14%), మారుతీ (0.96%), టాటా స్టీల్ (0.54%), ఎన్టీపీసీ (0.39%), ఐటీసీ (0.21%).
టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-4.30%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.26%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.78%), యాక్సిస్ బ్యాంక్ (-2.02%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.02%).