శీతాకాలం వచ్చిందంటే చాలు..కశ్మీర్ లో విపరీతంగా మంచు కురుస్తుంది. అయితే ఎండా, వానా లెక్కచేయకుండా దేశ సరిహద్దుల్లో గస్తీ కాసే సైనికులకు ఇది ఇబ్బందిగా మారింది. జవాన్లు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనే కాపలా కాస్తున్నారు. 7,200 అడుగుల ఎత్తులో భారత సైన్యం యొక్క చివరి చెక్ పోస్టు వద్ద సైనికులు మంచులో గస్తీ కాస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.