షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమాను చూస్తూ కొంతమంది యువకులు థియేటర్ లో గొడవపడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పఠాన్ సినిమాలోని బేషరమ్ రాంగ్ పాటపై వారి మధ్య వివాదం నెలకొంది. ఫీనిక్స్ మాల్ లోని పీవీఆర్ లో జరిగిన ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇజ్జత్ నగర్ పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.