పాకిస్థాన్ వ్యయ నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో 10 శాతం కోత విధించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ప్రధాని నియమించిన జాతీయ వ్యయ నియంత్రణ కమిటీ చేసిన ప్రతిపాదనల్లో ఇదొకటిగా తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల ఖర్చును 15 శాతం తగ్గించాలని, సమాఖ్య మంత్రులు, రాష్ట్ర మంత్రు లు, సలహాదారుల సంఖ్యను 78 నుంచి 30కి తగ్గించాలని ఈ కమిటీ ప్రతిపాదించింది.