గుంటూరు, నగరంలోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జిజిహెచ్ నందు ఈ రోజు గురువారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపర్డెంట్ డాక్టర్ ప్రభావతి గణతంత్ర దినోత్సవ యొక్క ప్రాముఖ్యతని వైద్యశాల ఉద్యోగులకు వివరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపర్డెంట్ పద్మశ్రీ, హెచ్వైడి జనరల్ మెడిసిన్ సుధాకర్, సీనియర్ డాక్టర్స్ జాహ్నవి, రాధిక, సత్యవాణి, మరియు ఏడి, ఈవో, డిప్యూటీ నర్సింగ్ స్టాఫ్, శానిటరీ, సెక్యూరిటీ ఉద్యోగులందరూ హాజరయ్యారు.