జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. బ్రిటీష్ వాళ్లు దేశం విడిచి వెళ్లినా వాళ్ల అహంకార ధోరణి వైసీపీ నేతల్లో కనిపిస్తోందని అన్నారు. 'వైసీపీ నేతలు బాధ్యతతో ఉండాలి. లేకుంటే మెడలు వంచుతాం. తోలు తీస్తాం. ప్రజాస్వామ్యం సజ్జల, జగన్ సొంతం కాదు. వేర్పాటు ధోరణితో ఉంటే నా అంతటి తీవ్రవాదిని చూడరు. దేశ సమగ్రతకు భంగం కలిగించి, మతాల మధ్య చిచ్చుపెడ్తే ఊరుకోను' అని స్పష్టం చేశారు.