ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయ దుకాణ సముదాయంలోని 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగింది. ఒక్కో దుకాణంలో సుమారు రూ.2 నుంచి రూ.3 లక్షల విలువైన వస్తువులు దగ్ధమైనట్లు వ్యాపారులు చెబుతున్నారు. మొత్తంగా రూ.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.