భర్త కళ్ల ముందే నవ వధువును ఆమె కుటుంబసభ్యులు కిడ్నాప్ చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తెన్కాసి జిల్లాలో జరిగింది. కృతిక, వినీత్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత డిసెంబరు 27న వివాహం చేసుకున్నారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆశ్రయించారు. అయితే యువతి పేరెంట్స్ తమ బంధువుల సాయంతో అల్లుడిని కొట్టి కూతురిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.