మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో దొంగతనానికి వెళ్లిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కల్రీలో మూసి ఉన్న బొగ్గు గనిలో జంక్ మెషీన్‌ల నుంచి ఇనుము దొంగిలించడానికి దొంగల ముఠా ప్రవేశించింది. వీరికి కాపాలాగా ఓ వ్యక్తి బయటే నిల్చున్నాడు. వారు ఎంతసేపటికీ బయటకి రాకపోగా ఎలాంటి స్పందన లేకపోవటంతో పారిపోయి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో సిబ్బంది అక్కడికి చేరుకుని చనిపోయి పడి ఉన్న నలుగురిని బయటకి తీసుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa