రథసప్తమి సందర్భంగా అనంతపురం జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో శనివారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా స్వామి వారు సూర్యప్రభ, హనుమ, గరుడ వాహనాలపై విహరించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంలో వందలాదిమంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, మాజీ చైర్మన్ అశోక్, అర్చకులు ద్వారాకనాథ్, బాలాజీ స్వాములు పాల్గొన్నారు.