చిట్వేలి మండల పరిధిలో ఖాళీగా ఉన్న గ్రామ వాలంటీర్ల ఎంపికకు శనివారం ఉదయం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చిట్వేలి ఇంచార్జ్ మండల అభివృద్ధి అధికారి మోహన్ తెలిపారు. సి కందులవారిపల్లి గ్రామపంచాయతీలో 2, చిట్వేలి గ్రామపంచాయతీలోని సింగనమల వీధిలో 2, చిట్వేలు మెయిన్ రోడ్ లో 2 గ్రామ వాలంటీర్ల నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన కోరారు.