శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి నాగమణి శుక్రవారం సందర్శించారు. ఆమె మాట్లాడుతూ సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఉమ్మడి జిల్లాలో సీతంపేట పాలిటెక్నిక్ కళాశాలలోని గిరిజన విద్యార్థులు ప్రవేశాలు పెంచేల హాస్టల్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరం పాలిటెక్నిక్ ప్రవేశ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఆమె వివరించారు.