మీకు సాయంకాలం ఆకలైతే బాదం పప్పులు తినండి. ఇది చక్కటి చిరుతిండి. ఆకలి తీరుతుంది. శక్తి కూడా వస్తుంది. లేదా ఆపిల్ తినండి. ఆపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండవచ్చు. వేరుశనగలు చాలా ఆరోగ్యకరమైన, పోషక విలువలున్న చిరుతిండి. రోజు కొన్ని వేరుశనలు తినండి. కడుపు నిండి, తక్కువ కేలరీలు కావాలంటే ద్రాక్ష పళ్ళు సరైన మార్గం. ఒక 30 ద్రాక్ష పళ్ళు తినండి. మీకు తినడం ఇష్టం లేకపోతే, తేలికగా చేసుకునే టమాటో సూప్ తాగండి.