హర్వార్డ్ పరిశోధకులు 26 ఏళ్లు 1,21,050 మంది పురుషులు, స్త్రీల ఆరోగ్య పరిస్థితులను విశ్లేషించారు. ఆయా వ్యక్తులు తినే ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితులు గురించి లోతుగా అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా అతిగా మాంసం, అధిక కెలోరిలు కలిగిన శీతల పానీయాలు తాగేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ ఏర్పడినట్లు గుర్తించారు. ఏదైనా ‘అతి’ అనర్థదాయకం. మాంసాహారమైనా, శాఖహారమైన సమతుల్యంగా ఉన్నప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.