దిగ్గజ కార్ల తయారీ సంస్థ BMW దేశీయ మార్కెట్లోకి మరో కారును రిలీజ్ చేసింది. BMW X1 పేరుతో ఈ కారును లాంచ్ చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. 1.5 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ లతో అందుబాటులో ఉంది. ఈ కారు ధర పెట్రోల్ వెర్షన్ రూ.45.90 లక్షలు కాగా, డీజిల్ వెర్షన్ రూ.47.90 లక్షలు. ఈ కారు బుకింగ్స్ కూడా కంపెనీ ప్రారంభించింది.