యస్ రాయవరం మండలం రేవుపోలవరం గ్రామంలో ఆదివారం నర్సీపట్నం నుండి రేవు పోలవరం సముద్ర స్నానాలకి వచ్చిన 9 మంది యువకులలో కొమ్మోజీ రేవంత్ (15) పదవ తరగతి చదువుతున్నా యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం నుండి కూడా మెరైన్ పోలీసులు సముద్ర తీరం వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఏ ఆచూకీ తెలియలేదు. రేవంత్ కుటుంబ సభ్యులు అందరూ కూడా తీరంలో ఏడుస్తూ కుమారుడు ఎప్పుడు వస్తాడని ఆశతో తల్లిదండ్రులు గోరున ఏడుస్తున్నారు.