నూజివీడు మండలం కొత్తూరు తండాలో ఆదివారం సాయంత్రం గుట్కాకు బానిసైన వ్యక్తి క్షణికోద్రేకానికి ఓ నిండు ప్రాణం బలైన ఘటన జరిగింది. రావూరి పోర్యా, బాణావతు ఏసు(25) పరిచయస్తులు. రెక్కాడితే కాని డొక్కాడని ఏసు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొల నుకు నిత్యం కుప్పలు కొట్టే పనికి వెళ్ళి వస్తుంటాడు. ఇంటికి వచ్చిన ఏసు ఊళ్లోకి వెళ్లాడు. అక్కడ పోర్యా తనకు గుట్కా ఇవ్వమని ఇతనిని అడిగాడు. అతను నిరాకరించడంతో క్షణికోద్రేకంలో పోర్యా తన దగ్గరున్న కత్తితో ఏసుపై దాడి చేశాడు. కత్తి గుండెకు తగిలి ఘటనా స్థలంలోనే ఏసు మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. రూరల్ ఎస్ఐ టి.రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. రాష్ట్రంలో పరిస్థితులు, అలానే సమాజం ఎలా ఉందొ ప్రజలు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది.