పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన అర్జున్ రవి అనే ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ కలసి జీవించాలనుకోవటంతో రవి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారాడు. అనంతరం తన పేరును మీన్ రియాగా మార్చుకుని అర్జున్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఓ పాపను దత్తత తీసుకుని సంతోషంగా గడుపుతున్న వారిని రియా కుటుంబీకులు వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటీవలే రియా బంధువులు ఇంటికి వచ్చి తమని కొట్టారని అర్జున్ ఆరోపించాడు.