అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హీరేహల్ మండలంలో ఫిబ్రవరి 2వ తేదీన ద్విచక్ర వాహనాల వేలం పాటు నిర్వహిస్తున్నట్టు ఎస్సై రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో మీడియాకు తెలిపారు. వివిధ కర్ణాటక మద్యం కేసుల్లో పట్టుబడ్డ 17 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో మొత్తం 18 వాహనాలను పోలీస్ స్టేషన్ ఆవరణలో రెండవ తేదీన ఉదయం 10 గంటలకు వేలంపాట నిర్వహిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు వేలంపాటకు ముందస్తుగా 4వేల రూపాయలు, ఆటో వేలంపాటకు పదివేల రూపాయలు ముందస్తు డిపాజిట్ చెల్లించి టోకెన్ నెంబర్ పొందాలని తెలిపారు.