అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మంగళవారం భారీ ప్రమాదం చోటు చేసుకుంది. జీఎఫ్ఎంఎస్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. ఘటనకు గల కారణాలపై అధికారులు అన్వేషిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa