నేడు కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం అయింది. ఈ భేటీలో బడ్జెట్ కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక పద్దు 2023-24ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.