విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతేడాది జనవరి నుండి పెండింగ్ ఉన్న డీఏ చెల్లించేలా ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 పీఆర్సీ ప్రకారం22.02 శాతంగా ఉన్న డీఏ 24.99 శాతానికి పెరగ్గా, ఈ పెంపు ఉద్యోగులతో పాటు పెన్షన్ దారులకు కూడా వర్తిస్తుంది. ఈ మేరకు ట్రాన్స్ కో, జెన్ కో, డిస్కంలు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి.