శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని మైనారిటీ కస్తూర్బా విద్యాలయం నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం ఉర్దూ స్టడీ మెటీరియల్ లను ఎంఈఓ గంగప్ప చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఉర్దూ చదువుతున్న విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇమ్రాన్ జాకీర్ హుస్సేన్ వారు సొంతంగా తయారుచేసిన స్టడీ మెటీరియల్ లను నీకు ఉచితంగా అందజేయడం జరిగిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలనివిద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నరేంద్ర, ఉర్దూ అకాడమీ అజీజియా ఇమ్రాన్, జాకీర్ హుస్సేన్, ప్రిన్సిపాల్ ఉషారాణి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.