అదానీ ఎంటర్ ప్రైజెస్ 20 వేల కోట్ల విలువైన తన ఎఫ్ పీవోని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీనిపై అదానీ గ్రూప్స్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వివరణ ఇచ్చారు. భారీగా సబ్ స్క్రైబర్లు పొందిన తర్వాత ఎఫ్ పీవోని రద్దు చేసామని, ఈ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసిందని, కానీ మార్కెట్ అస్థిరతను పరిగణలోకి తీసుకుంటే ఎఫ్ పీవోని కొనసాగించడం నైతికంగా సరైనది కాదని బోర్డు భావించిందని ఆయన వెల్లడించారు.