ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన జమ్ముకశ్మీర్ లో గత నాలుగురోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో లోయలోని నాలుగు జిల్లాలకు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. బారాముల్లా, గందర్బల్, కుప్వారా, బండిపొర మీదుగా 2,400 మీటర్ల ఎత్తులో ప్రమాదకర స్థాయిలో హిమపాతం సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఆ ప్రాంతాలకు ప్రజలు వెళ్లకూడదని సూచించింది. కాగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన గుల్మార్గ్లోని అఫర్వత్ పర్వతం వద్ద చరియ విరగడంతో పోలండ్‌కు చెందిన ఇద్దరు పర్యాటకులు మృతిచెందారు. మరో 19 మంది పర్యాటకులు గాయపడ్డారు.