ధనవంతుల గురించి మనం రోజూ వింటూనే ఉంటాం. కానీ, ఓ పెంపుడు కుక్క ఏకంగా రూ.655 కోట్ల ఆస్తికి యజమానిగా మారింది. షెపర్డ్ జాతికి చెందిన ఈ శునకం జర్మన్ కౌంటెస్ కార్లోటా లైబెన్ స్టెయిన్ అనే ధనవంతుడి నుంచి ఈ ఆస్తిని వారసత్వంగా పొందింది. వారసులు లేని లైబెన్ స్టెయిన్ చనిపోయే ముందు ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి తన పెంపుడు కుక్కకు దాదాపు రూ.655 కోట్ల ఆస్తి రాసిచ్చాడు. దీంతో ఈ శునకం రిచెస్ట్ డాగ్ గా మారింది.