ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామమందిర నిర్మాణానికి నేపాల్ ప్రభుత్వం సాలగ్రామ శిలలను అందజేసిన విషయం తెలిసిందే. ఈ సాలగ్రామ శిలలు నేడు అయోధ్యకు చేరుకున్నాయి. దీంతో భక్తులు దారి వెంట బాణాసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. అయోధ్య వీధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. 60 మిలియన్ల వయసున్న ఈ శిలలతోనే రాముడి విగ్రహానికి తయారుచేయనున్నారు.