ప్రముఖ సినీ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కళాఖండాలుగా నిలిచిన అనేక చిత్రాలను అందించిన విశ్వనాథ్ మృతి తనను తీవ్రంగా కలచివేసిందని చంద్రబాబు అన్నారు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటన్నారు. విశ్వనాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.