నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కృష్ణాపురం గ్రామ శివారు ప్రాంతంలో నాటు సారా తయారీకి ఉపయోగిస్తున్న సుమారు 1500 లీటర్ల బెల్లం పులుపును టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నమ్మి గణేష్ ఆధ్వర్యంలో శనివారం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటు సారా తయారీ చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నాటు సారా తయారీ, రవాణా చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటు సారా విక్రయాలు జరిగితే సమాచారాన్ని పోలీసులకు అందజేయాలన్నారు.