విశాఖ రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో మునిగిపోతున్న ఓ యువకుడిని టూరిజం బ్లూ ఫాగ్ బీచ్ లైఫ్ గార్డ్స్ రక్షించారు. ఛత్తీస్ గడ్ రాష్టానికి చెందిన 8మంది విహార యాత్రకు వచ్చారు. వీరంతా సముద్రంలో స్థానాలు చేస్తుండగా రాకాసి అలలకు అమిత్ అనే యువకుడు కొట్టుకుపోతూ కేకలు వేయడంతో లైఫ్ గార్డ్స్ ఎస్ నూకరాజు, శ్రీనివాస్ గుర్తించారు. సకాలంలో గుర్తించి ఒడ్డుకు చేర్చి ప్రధమ చికిత్సఅందించారు.