గొలుగొండ మండలం రావణాపల్లి గ్రామంలో శనివారం గౌరీ పరమేశ్వరుల ఉత్సవాలు వైభవంగా ముగిసాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా గ్రామంలో మహిళలు సారెను ఊరేగింపుగా తీసుకువెళ్లి పార్వతీ పరమేశ్వరులకు నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మేళ తాళాలు మహిళల కోలాటంతో గౌరీ పరమేశ్వరులను ఊరేగించి గ్రామ సమీపంలో గల రిజర్వాయర్ లో నిమజ్జనం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa