చిత్తూరు జిల్లా పుంగనూరు లో జెట్టి కుల సంఘం అధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ జీర్ణోద్ధరణ ప్రతిష్ఠాపన మహోత్సవం లో ఆదివారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు వేద పండితులు అమ్మవారి శేష వస్త్రాన్ని బహుకరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.