నిజాంపట్నం మండలం అడవులదీవి గ్రామంలోని శ్రీ భ్రమరీ బాలా త్రిపుర సుందరి సహిత శ్రీ మల్లికార్జున స్వామి తిరునాళ్ల అత్యంత వైభవంగా జరిగింది. తిరునాళ్ల సందర్బంగా ఆదివారం దిండి పరిశా వారి పాలెం బీచ్ లో భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. సముద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. సముద్ర స్నానాలు చేసేందుకు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు.