కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలే తాను పోటీ చేసే చివరి ఎన్నికలు అని ప్రకటించారు. అయితే తాను రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోనని స్పష్టం చేశారు. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సీఎం కుర్చీ కోసం పోటీ ఉందని బీజేపీ ఆరోపిస్తున్న నేపథ్యంలో సిద్ధరామయ్య తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.