టర్కీ,సిరియాలో భారీ భూకంపం సంభవించింది. నుర్దాగీ ప్రాంతానికి 23 కిలోమీటర్ల దూరంలో 10 కి.మీ లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు US జియాలాజికల్ సర్వే తెలిపింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. అకస్మాత్తుగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 100 మంది వరకు మరణించగా, భారీ ఆస్థి నష్టం జరిగింది.