చీరాల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వేటపాలెం మండలం పందిళ్ళపల్లి గ్రామంలో ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కొండయ్య మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పాతర వేశాడని, అందరి హక్కులను కాలరాస్తున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరిగి చంద్రబాబు ప్రభుత్వం వస్తేనే ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకుంటారని చెప్పారు. టిడిపికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీ సీనియర్ నేతలు నాసిక వీరభద్రయ్య, బొగ్గుల పార్థసారధి, పేరిశెట్ల బాలచంద్ర, కొమ్మన రజనీ, ఇతర నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.